calender_icon.png 28 October, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు మద్దతు ధర లభించేలా కృషి

28-10-2025 12:36:12 AM

మొక్కజొన్న కొనుగోళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాం తి): పండించిన పత్తి, సోయా మొక్కజొన్న పంటలకు మద్దతు ధర లభించేలా కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ వ్యవసా య మార్కెట్ యార్డులో సోమవారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా తూకం కంటాలకు ప్రత్యేక పూజలు చేసి, పంటను మార్కె ట్‌కు తీసుకువచ్చిన తొలి రైతును సన్మానిం చి కొనుగోలను లాంచనంగా ప్రారంభించా రు.

క్వింటాలు మొక్కజొన్న మద్దతు ధర రూ. 2, 400లకు కొనుగోళ్లు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కొనుగోలు చేపడుతున్నాయని తెలిపారు. మద్దతు ధర కంటే తక్కువ గా వ్యాపారాలు కొనుగోలు చేస్తున్నారని రైతులు పేర్కొంటున్నారని, మద్దతు ధర లభించేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామల దేవి, డిసిసిబి చైర్మన్ అడ్డి బోజారెడ్డి, మార్కెట్ యార్డ్ అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.