calender_icon.png 28 October, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే..

28-10-2025 12:36:21 AM

బీఎస్పీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్

సిద్దిపేట, అక్టోబర్ 27 (విజయక్రాంతి): బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని బిఎస్పి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ డిమాండ్ చేశారు. సోమవారం బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో వాల్ పోస్టర్ ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. నవంబర్ 1న హైదరాబాదు లోని ఇందిరాపార్క్ వద్ద బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పై జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు పెంచే ప్రక్రియలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు.

బీసీలు ఏకమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షిరాం ఆనాడే మండల కమిషన్ అమలు చేయండి లేదా ప్రధాని కూర్చి కాళీ చేయండి అని ప్రశ్నించారని గుర్తు చేశారు. బీఎస్పీ ద్వారానే బహుజనులకు రాజ్యాధికారం, సామాజిక న్యాయం జరుగుతుందని బీఎస్పీ ఉద్యమం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి గజ్జల తిరుపతి మౌర్య, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేష్ ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండనోళ్ళ నరేష్, నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ , పంగా బాబు, వేల్పుల రాజు, కొమ్ము చంద్రం, కొండపలకల సంపత్, పోతారం రాజు, కరుణాకర్, కనక ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.