calender_icon.png 28 October, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స.హ. చట్టం దరఖాస్తులకు స్పందించండి

28-10-2025 12:35:27 AM

  1. డీజీపీ శివధర్‌రెడ్డికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ విజ్ఞప్తి
  2. సానుకూలంగా స్పందించిన డీజీపీ

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 27 (విజయక్రాంతి): ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సభ్యులు సోమవారం రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి, ఫోరం కార్య క్రమాలు వివరించారు. ముఖ్యంగా జిల్లా స్థాయిలో పోలీసు కంప్లయింట్ అథారిటి నియామకం, జిల్లా, మండల స్థాయిలోని పోలీసు స్టేషన్లలో సమాచారహక్కు చట్టం దరఖాస్తులకు సరియైన స్పందన లేదని డీజీ పీ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి డీజీపీ స్పం దిస్తూ తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డీజీపీని కలిసిన వారిలో ఫోరం అధ్యక్షుడు ఎం పద్మనాభరెడ్డి, ఉపకార్యదర్శి పి భాస్కరరెడ్డి, బోర్డు మెంబర్లు టి వివేక్, మ్రహ్మద్ రఫీ ఉన్నారు.