తెలంగాణను స్పోర్ట్స్‌హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి
- ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డి వెల్లడి
- మంత్రులు, ఎంపీల సమక్షంలో బాధ్యతలు స్వీకరణ
- అభినందించిన దీపాదాస్ మున్షీ, మంత్రులు, ఎంపీలు
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి) : పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన జితేందర్‌రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. ఈ మేరకు బుధవారం ఆయన ఢిల్లీలో బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కుల కోసం తనవంతు ప్రయత్నం చేస్తానని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వారధిగా ఉంటానని పేర్కొన్నారు.
రాష్ట్రానికి అంతర్జాతీయ ఈవెంట్స్ వచ్చేలా చేసి తెలంగాణను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేలా కృషి చేస్తానని తెలిపారు. బీబీనగర్‌లో ఏయిమ్స్, కృష్ణా జలాల్లో వాటా కేటాయింపులపై కేంద్రం పెద్దలతో చర్చించి త్వరగా సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తనను నమ్మి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించి కేబినెట్ హోదా కల్పించారని చెప్పారు. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘురామిరెడ్డి, బలరాంనాయక్, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వివేక్ , మాజీ మంత్రి జానారెడ్డి తది హాజరై జితేందర్‌రెడ్డిని అభినందించారు.






