calender_icon.png 10 May, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

15-10-2024 02:40:38 AM

జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు మధుయాష్కీగౌడ్

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 14(విజయక్రాంతి) : జలమండలి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ బి గౌరవ అధ్యక్షుడు మధుయాష్కీగౌడ్ అన్నారు. సోమవారం తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఉద్యోగుల రిటైర్మెంట్ గ్రాట్యుటీ, డెత్ గ్రాడ్యుటీ సమస్యల పరిష్కారం గురించి ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా మధుయాష్కిగౌడ్ మాట్లాడుతూ.. ఉద్యోగులు సూచించిన సమస్యలను  జలమండలి ఎండీ, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సతీష్‌కుమార్, రాఘవేంద్రరాజు, సీనియర్ నాయకులు.. రాజిరెడ్డి, దేవేందర్, ఆనంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.