10 March, 2026 | 3:55 PM

మిలియన్ మార్చ్ స్ఫూర్తితో ముందుకెళ్దాం

10-03-2026 02:39 PM

మిలియన్ మార్చ్@15ఏళ్లు 

హైదరాబాద్: ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన ఘట్టం మిలియన్ మార్చ్(Million March) కు 15 ఏళ్లు అయిందని మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) అన్నారు. ట్యాంక్ బండ్ మీద తెలంగాణ ఆత్మగౌరవం ఉప్పొంగిన రోజు అని ఆయన వెల్లడించారు. ఆనాటి పోరాట స్ఫూర్తి ప్రతి తెలంగాణ బిడ్డ గుండెల్లో ఇప్పటికీ సజీవంగా ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మన హక్కుల కోసం, మన అస్తిత్వం కోసం కొట్లాడామని గుర్తుచేశారు. నేడు మన వనరులను మళ్లీ దోచుకోవాలని చూస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మిలియన్ మార్చ్ స్ఫూర్తితో ముందుకెళ్దామని ఆయన పిలుపునిచ్చారు.