1 May, 2026 | 8:51 PM

ఏయూ లో జాతీయ ఫార్మసీ ఎడ్యుకేషన్ డే సంబరాలు

10-03-2026 02:15 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి):  వెంకటాపూర్ లోని అనురాగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఫార్మసీ(Anurag University School of Pharmacy) ఆధ్వర్యంలో డాక్టర్ మహదేవ్ లాల్ శ్రాఫ్ జన్మదినం సందర్భంగా జాతీయ ఫార్మసీ ఎడ్యుకేషన్ డే సంబరాలు జరపుకున్నారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ దినేష్ నీరడి, ఫౌండర్ నీరడి బయోసైన్సెస్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఫార్మసీ విద్య ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో డీన్ వసుధా బక్షి మాట్లాడుతూ ఫార్మసీ రంగంలో వస్తున్న వినూత్న మార్పులను, అవకాశాలను అంది పుచ్చుకోవాలని తెలిపారు. డాక్టర్ కుమార్ నెమ్మని డైరెక్టర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మాట్లాడుతూ ఫార్మసీ రంగంలో రీసెర్చ్ అవకాశాలను వినియోగించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన వక్తృత్వ, క్విజ్ పోటీలలో విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్లు డాక్టర్ రమాదేవి, డాక్టర్ రాంగోపాల్, స్వస్త్య కోఆర్డినేటర్ డాక్టర్ సునంద్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.