9 July, 2026 | 6:45 PM

జ్యోతి కాలనీ, బజరంగ్ కాలనీల సమస్యల పరిష్కారానికి కృషి

09-07-2026 05:51 PM

నిజాయితీగల ఓటర్లకు అండగా ఉంటాం.

జవహర్ నగర్ డివిజన్ అధ్యక్షురాలు శాంతి కోటేశ్ గౌడ్ 

జవహర్ నగర్, జులై 9 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ డివిజన్ కాలనీ సమస్యలపై, ఓటర్ల సంక్షేమంపై దృష్టి సారించేందుకు మాజీ మేయర్ డివిజన్ అధ్యక్షురాలు దొంతగాని శాంతి కోటేశ్ గౌడ్ సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె జ్యోతి కాలనీ అధ్యక్షుడు జి. సూర్యనారాయణ బబ్లు, బజరంగ్ కాలనీ అధ్యక్షుడు ఇంద్రాసేన రావ్ లతో సమావేశమయ్యారు. కాలనీల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాల సమస్యలపై చర్చించి వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మాజీ మేయర్ డివిజన్ అధ్యక్షురాలు శాంతి కోటేశ్ మాట్లాడుతూ సర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ సహకరించాలని, నిజాయితీగల ఓటరు నష్టపోకుండా చూసే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, అర్హులైన వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు కార్యకర్తలు ముందుండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు బల్లి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు ప్రేమల శ్రీను, కుతాడి సాయి, కృష్ణ గౌడ్, ఎస్సీ సెల్ చైర్మన్ కొలిపాక సాయికిరణ్, మాజీ ఎంపీటీసీ విజయ రాయ్, ఏడుకొండలు, సరితతో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు.