- భూదాన్ రామచంద్రారెడ్గి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి
- తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి
ముషీరాబాద్, జూలై 17: భూదాన్ యజ్ఞ బోర్డును పునరుద్ధరించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి తెలిపారు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో భూదాన్ రామచంద్రారెడ్డి స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన భూదాన్ ఉద్యమ నేత వెదిరే రామంచంద్రారెడ్డి 119వ జయంతిలో ఆయ న మాట్లాడారు. భూదాన్ భూముల పరిరక్షణతో పాటు, భూదాన్ వెదిరే రామచం ద్రారెడ్డి, తెలంగాణ అమరుల చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని బెల్ట్ షాపుల మూసివేతకు ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ అంశాలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. భూదాన్ భూములను పరిరక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.