టిఫిన్ సెంటర్లను కూలగొట్టడం అన్యాయం
మీకు న్యాయం చేస్తా
బాధితులకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భరోసా
భువనగిరి, మార్చి 13(విజయక్రాంతి): భువనగిరి హైవే రోడ్డుపై పేదల జీవనాధారమైన టిఫిన్ సెంటర్లను టోల్ గేట్ అధి కారులు అక్రమంగా కూలగొట్టడాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) చీఫ్ ఎమ్మె ల్సీ తీన్మార్ మల్లన్న తీవ్రంగా ఖండించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకొని అక్కడి పరిస్థితులను పరిశీ లించారు.ఈ సందర్భంగా టోల్ గేట్ అధికారులను అక్కడికే పిలిపించి పేదల ఉపాధిని నాశనం చేయడం ఏమాత్రం సమంజసం కాదని మండిపడ్డారు.
సంవత్సరాలుగా అక్కడ టిఫిన్ సెంటర్లు నిర్వహిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న వారి జీవనో పాధినీ ఒక్కసారిగా కూలగొట్టడం అన్యా యం అని మండిపడ్డారు. టిఫిన్ సెంటర్లు నిర్వహిస్తున్న బాధితులతో మాట్లాడిన మల్ల న్న వారికి భరోసా ఇచ్చారు. పేదల కడుపు కోసే చర్యలను సహించేది లేదు. మీకు న్యా యం జరిగే వరకు నేను మీతోనే ఉంటాను అని తెలిపారు. వెంటనే టోల్ గేట్ అధికారులతో మాట్లాడి టిఫిన్ సెంటర్లు తిరిగి నిర్వహించుకునేలా చూడాలన్నారు. దీంతో అక్కడి టిఫిన్ సెంటర్ యజమానులు మల్లన్నకు కృతజ్ఞతలు తెలిపారు.




