14 March, 2026 | 3:48 AM

నీటి సంఘాలు ఏర్పాటు చేయాలి

14-03-2026 02:25 AM
  1. చెరువులకు హద్దులు, పూడికతీత, జియో ట్యాగింగ్ అవసరం 
  2. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి రైతు కమిషన్ బృందం ప్రతిపాదన 

హైదరాబాద్, మార్చి13 (విజయక్రాంతి): రాష్ట్రంలో చెరువుల అభివృద్ధి, నీటి సంఘాలను ఏర్పాటు చేయాలని, వీటికి చెరువుల నిర్వహణ బాధ్యత అప్పజెప్పాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని రైతు కమిషన్ కోరింది. మేజర్ ఇరిగేషన్ నుంచి మైనర్ ఇరిగేషన్‌ను విడదీసి చెరువులను అభివృద్ధి చేయాలన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో రైతుక మిషన్ చైర్మన్ కోదండరెడ్డి, కమిషన్ సభ్యు లు శుక్రవారం సచివాలయంలో భేటీ అ య్యారు.

ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలో చిన్న నీటిపారుదల పునర్వ్యవస్థీకరణ కోసం రైతు కమిషన్ ఆధ్వర్యంలో వేసిన కమిటీ ఇచ్చిన 45 పేజీల నివేదికను ఇవాళ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి కమిషన్ బృందం అందజేసింది. అదేవిధంగా చెరువుల అభివృద్ధి, పరిరక్షణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ప్రధానంగా ఐదు అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి.

1. చెరువుల ఆక్రమణలు తొలగించి, ఎఫ్‌టీఎల్ హద్దులను గుర్తించాలి. 2. చెరువుల పూడిక తీత చేపట్టి నీటి నిలువ సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలి. 3. చెరువు కట్టలు, తూముల రిపేర్లు, ఇతర మరమ్మతుల ను చేయాలి. 4. ప్రతి చెరువును జియో ట్యాగింగ్ చేయాలి. 5. నీటి సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించింది. దీనికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు.  సమావేశంలో క్రీడా, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రైతు కమిషన్ సభ్యులు పాల్గొన్నారు.