ఎలిమినేడు గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి
30-05-2024 01:53 AM
ఇబ్రహీంపట్నం, మే 29 : ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామంలోని సమస్యల పరిష్కారానికై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని గ్రామస్థులు కలిశారు. బుధవారం గ్రామంలో నెలకొన్న సమస్యలను వివరించారు. ఆర్‌టీసీ బస్సులు, శ్మశాన వాటిక, రోడ్ల సమస్యపై సంబంధిత అధికారులకు వారి ముందే ఫోన్ చేసి మాట్లాడారు. గ్రామంలో వేలాడుతూ కనిపించే విద్యుత్ తీగలు, కొత్త విద్యుత్ స్థంబాల అవసరం వంటి సమస్యలపై వెంటనే స్పందిం చాలని విద్యుత్ ఉత్పత్తి శాఖ ఏడీని కోరారు. విద్యుత్ అధికారులు స్పందిస్తూ.. నేడు గ్రామంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని, గ్రామంలో విద్యుత్ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.






