ప్రభుత్వ కళాశాలల బలోపేతానికి కృషి
కోదాడ మే 11: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక‘ లో భాగంగా కె .ఆర్. ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాల కోదాడలో విద్యా వారోత్సవాలను ప్రారంభించడం జరిగింది.
వారం రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాలకు మొదటి రోజులో భాగంగా సోమవారం మున్సిపల్ చైర్ పర్సన్ యేర్నేని కుసుమ వెంకటరత్నం బాబు హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, ఐ.ఎఫ్.పి.ఐ.డి.పి ప్యానల్స్ (టి.వి) ప్రారంభించి, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. చైర్మన్ కుసుమ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రమణారెడ్డి, స్థానిక మునిసిపల్ కౌన్సిలర్ మాలోతు చైతన్య నాయక్, మున్సిపల్ కౌన్సిలర్ రామిశెట్టి ఉదయశ్రీ హరిప్రసాద్, కళాశాల అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ శ్రీలక్ష్మి , అధ్యాపకులు వేముల వెంకటేశ్వర్లు, రణబోతు పిచ్చిరెడ్డి, రమేష్ శర్మ,పి. రాజేష్, జి.వెంకన్న, రామరాజు, రవి కిరణ్, సతీష్, జి. నాగరాజు, పి.తిరుమల, నరసింహారెడ్డి, ఎస్.కె. ముస్తఫా, కె.శాంతయ్య, జ్యోతిలక్ష్మి, చంద్రశేఖర్ గౌడ్, వెంకటేశ్వర చారి, మమత, డి.ఎస్.రావు పాల్గొన్నారు.






