11 August, 2026 | 2:37 AM

బుద్ధ విహార్ అభివృద్ధికి కృషి

11-08-2026 01:25 AM

నిర్మల్ ,ఆగస్టు 10 ( విజయ క్రాంతి) నిర్మల్ పట్టణంలోని బుద్ధ విహార్ అభివృద్ధికి కృషి చేస్తానని నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి అన్నారు. సోమవారం కమిటీ సభ్యులు మున్సిపల్ చైర్మన్ కు వినతిపత్రం అందించి బుద్ధ విహా ర్ వద్ద అభివృద్ధి పనులు చేపట్టాలని కోరా రు.

అభివృద్ధి పనులపై చర్చించారఈ కార్యక్రమంలో నిర్మల్ బుద్ధ విహార్ కమిటీ అధ్య క్షులు కుంటొల్ల వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి మధుకర్ మునేశ్వర్, గౌరవ సలహా దారులు సుదర్శన్ బౌద్ధ్, దేవుళ్ల గంగాధర్, జాడే భీమ్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మూడుసు సత్యనారాయణ, భారతీయ బౌ ద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు కొంతం మురళీధర్, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఈరోల పురుషోత్తం, కౌన్సిలర్లు కత్తి నరేందర్, నల్లూరి పోశెట్టి, కార్యవర్గ సభ్యులు భగత్ నారాయణ, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.