11 August, 2026 | 2:50 AM

ఆలయానికి రూ.32 లక్షలు మంజూరు

11-08-2026 01:26 AM

కుబీర్, ఆగస్టు 10 ( విజయ క్రాంతి): తానూర్ మండలంలోని హంగిర్గా గ్రామం లో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునర్ నిర్మాణానికి ప్రభుత్వం 32 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు ముధో ల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు. సోమవారం గ్రామస్తులు ఎమ్మెల్యేలు కలిసి నిధులు మంజూరు చేసినందుకు సన్మానం చేశారు. విధులకు అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.