28 August, 2026 | 8:18 AM

గ్రామాల అభివృద్ధికి కృషి

28-08-2026 12:00 AM

ఖానాపూర్, ఆగస్టు 27 (విజయ క్రాంతి): ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం కడెం మండలం లింగాపూర్ గ్రామంలో ఎస్‌ఐఆర్ ఫేజ్2లో భాగంగా నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉంటాయని, ఎన్నికల అనంతరం ప్రజా సమస్యల పరిష్కారమే తన ధ్యేయమన్నారు.

నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని, జాబితాలో తప్పులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిచేసుకోవాలని గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.