2 September, 2026 | 9:46 AM

టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ: 8 మందికి తీవ్రగాయాలు

19-05-2024 | 04:21pm

మిర్యాలగూడ: నల్లొండ జిల్లా మిర్యాలగూడ నందిపాడు బైపాస్ వద్ద ఆదివారం సాయంత్రం రోడ్డుప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన లారీ టాటా ఏస్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.