12-06-2025 12:00:00 AM
‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకుంది యంగ్ బ్యూటీ అవికా గోర్. ఆ తర్వాత హీరోయిన్‌గా మారింది. తెలుగులో పలు సినిమాలతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. కన్నడ, హిందీలో కూడా పలు సినిమాలు, సిరీస్‌లలో నటించిన అవికా గోర్ గత ఆరేళ్లుగా మిళింద్ చాంద్వానీ అనే ఓ సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్తతో ప్రేమలో ఉంది. గతంలో పలుమార్లు తన ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా కాబోయే భర్తతో నిశ్చితార్థం చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌మీడియా ద్వారా అభిమానుతో పంచుకుంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది అవికా. “అతడు ప్రపోజ్ చేశాడు. ముందుగా నవ్వే నా సమాధానం. తర్వాత భావోద్వేగానికి గురయ్యా.
చివరకు నా సమాధానం ‘ఎస్’. మనసులో మాట అతడు బయటపెట్టగానే.. నాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వినిపించింది. స్లో మోషన్‌లో వేడుక విజువల్స్ కనిపించాయి. గాల్లో తేలినట్టు అనిపించింది” అంటూ సినిమాటిక్ స్టుల్‌లో తమ పరిచయం, ప్రేమ గురించి చెప్పుకొచ్చింది అవికా.