2 April, 2026 | 2:06 AM

రైతులకు యాప్ కష్టాలు

02-04-2026 12:00 AM
  1. యూరియా యాప్‌తో రైతులకు తీరని కొరత
  2. ఇక వ్యవసాయమే దండుగంటున్న రైతన్న

ఎల్లారెడ్డి, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో, మండలంలో నియోజకవర్గంలో యూరి యా కొరత వెక్కిరిస్తుంది. రాష్ట్రంలో యూరియా కొరత అధికంగా ఏర్పడడంతో రైతులు పంటలకు సరైన సమయానికి యూరియా అందించక తీవ్ర అవస్థలు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం యూరియాను తగ్గించాలని సంకల్పంతో చేస్తున్న కృషి పట్ల రైతు తీవ్ర అసంతృప్తి నీ వ్యక్తం చేస్తున్నారు.

ప్రాథమిక సహకార సంఘాలు ఎందుకు వాటిలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు వేతనాలు దండగ అంటూ పలువు రైతులు మండిపడుతున్నారు. ప్రాథమిక సహకార సంఘంలో యూరియా ఇతర ఎరువు బస్తాలు వరి ధాన్యం బస్తాలు ఇతరేతర పంటలకు సరిపడా గింజలు ధాన్యం,

ఎరువులు రైతులకు అందుబాటులో ఉండడానికి మండలంలోని 10 గ్రామాల కలిపి ఒక ప్రాథమిక సహకార సంఘాన్ని నిర్మాణం చేసి ఏళ్ల తరబడి సహకార సంఘానికి అధ్యక్షులు డైరెక్టర్లను సిబ్బందిని ఏర్పాటు చేసి ఇన్ని రోజులకు యాప్ ద్వారా యూరియాను పంపిణీ చేయడం పట్ల సహకార సంఘాలకు ఎందుకని వాటిలో పనిచేస్తున్న సిబ్బందికి జీవితాలు ఎందుకని తీవ్రంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. 

సహకార సంఘంలో నిలువ లేని యూరియా 

సహకార సంఘంలో యూరి యా వస్తుందని ఆశలు పెట్టుకున్న అన్నదాతకు అడియాసలు మొదలయ్యాయి. అసలు యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలంగా ఉందని సిబ్బంది సరిగ్గా వ్యవహరిం చకపోవడం, పదుల సంఖ్యలో వందల సంఖ్యల్లో ఎకరాలు హెక్టార్లు ఉన్న రైతులకు మాత్రమే సహకార సంఘంలో పనిచేస్తున్న సిబ్బంది యూరియా రావడానికి ముందు సమాచారం అందించి సన్న కారు రైతులకు యూరియా అందకుండా చేస్తున్నారని వా పోతున్నారు.

వేల రూపాయల వేతన మం దుకుంటున్న సహకార సంఘం అధికారులు సమయానికి ఎరువులు సరఫరాలు నిర్లక్ష్యం చేయడం సమయానికి యూరియాను రైతులకు అందజేయడంలో అధికా రులు పూర్తిగా విఫలమయ్యారని ఇక సహకార సంఘాలు ఉండడం వ్యర్థమని పలు రైతులు ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు. 

యాప్ ద్వారా యూరియా 

ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియాను సరఫరా చేస్తున్న ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా నుంచి మండల స్థాయి వ్యవసాయ అధికారులు ఎందుకని డైరెక్టుగా ఫర్టిలైజర్ దుకాణాల సముదాయాలతో యూరియా సరఫరా జరుగుతుందని పట్టా లేని రైతుకు సన్న కారు రైతుకు యూరియా దొరకడం లేదని కేవలం క్షణంలోనే యూరియా దుకాణంలో ఫర్టిలైజర్ దుకాణ సముదాయంలో ప్రాథమిక సహకార సం ఘంలో క్షణాలలో యూరియా అయిపోతుందని దిక్కుతోచని స్థితిలో అన్నదాత ఇతరేతర పంటలు వేయకుండ,

ఇతర పంటలు వేసిన రైతు పరిస్థితి అదో గతిగా మారుతుందని పలువురు రైతులు అధికారులపై ప్రభుత్వంపై మండిపడుతున్నారు. యాప్ ద్వారా మొదటి దశ రెండవ దశ ఎకరానికి రెండు సంచులు ఒక సంచి అంటూ సరఫరా చేస్తూ సన్నకారు రైతులకు లిక్విడ్ యూరియానే దిక్ అవుతుందని లిక్విడ్ యూరియా ద్వారా పంట పొలాలు ఎరుపు రంగులో మారి పంట పాడవుతుందని రైతులు ఆందోళన చెందుతున్న అధికారులకు గాను ఆ ప్రభుత్వాన్ని గాని పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. 

ఇక దీని పరిస్థితి ఏమిటో.. 

చెరుకు మొక్కజొన్న వేసిన రైతులకు యూరియా దొరకకపోవడం కొన్ని ప్రాంతాలలో అసైన్డ్ ఇతర భూముల్లో పంటలు సాగు చేసుకున్న రైతుకు యూరియా అందకపోవడం నిలువుకు పంట పాడవడం అధికారులకు ప్రభుత్వానికి నిలువెత్తు నిదర్శనంగా రైతు శాపం తలగరు ఉందని రైతులు మండిపడుతున్నారు. కనీసం అధికారులు స్పందించి యాప్ను తొలగించి రైతులకు ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా పంపిణ ఆపివేసి పంట వేసిన నిక్కారస్ అయిన రైతుకు సర్వే చేసి యూరియా అందించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు రైతులు ప్రాధేయ పడుతున్నారు. 

అధికారుల తీరుపై మండిపడుతున్న రైతులు ..

పలువురు రైతులు అసైన్డ్ గానీ ఇతరేతర భూముల్లో సాగు చేసుకున్న పంటల కోసం వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్ళినప్పటికీ పలువురు, అధికారులు పట్టాలేదని, దీనికి యూరియా బుక్ కాదని మాటలు చెబుతూ పాపం రైతులను గొంతు కోస్తున్నారు. అన్నదాతను ఆగం చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని పలువు రైతులు పేర్కొంటున్నారు.