30-07-2025 08:06:19 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాలకు చెందిన గారిగే రాజలింగు(76) అనే వృద్ధుడు ప్రమాదవశాత్తు ఇంటి సమీపంలోని బావిలో పడి మృతి చెందాడని ఎస్ఐ గోపతి సురేష్(SI Gopathi Suresh) బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మృతునికి వయస్సు పైబడడంతో మతిస్థిమితం సరిగ్గా లేదు అని అంతేకాకుండా గత 4 నెలల నుండి మూర్ఛ వ్యాధితో అవస్థాపడగా ఆసుపత్రుల్లో చూపించి మందులు వాడిన నయం కాకపోవడంతో ఈనెల 29న మధ్యాహ్నం ఇంటినుండి బయటికి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు వెతికిన ఆచూకీ దొరకకపోవడంతో బుధవారం ఉదయం బావిలో శవంగా కనిపించగా కుటింబీకులు గుర్తించి బావి దగ్గరకు వెళ్లగా ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయినట్లు మృతుని కూతురు పద్మ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.