30-07-2025 08:11:21 PM
పాపన్నపేట: పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకున్న విద్యార్థులు అందరూ కలిసి పాఠశాల అవసరాన్ని తీర్చాలని అనుకున్నారు. 2008-09 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులంతా వేసవి కాలంలో ఆ పాఠశాలలో గెట్ టు గెదర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులచే పాఠశాలలో పోడియం అవసరం ఉందని గుర్తించారు. అనంతరం వారంతా తీర్మానించుకొని బ్యాచ్ కి సంబంధించినటువంటి మిత్రులంతా కలిసి పోడియాన్ని కొనుగోలు చేసేందుకు నగదును సమీకరించారు. ఇలా సమీకరించిన నగదుతో పోడియాన్ని తీసుకొని బుధవారం పాఠశాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు తమ బ్యాచ్ పూర్వ విద్యార్థుల తరఫున ఈ పోడియాన్ని పాఠశాలకు బహుమానం చేస్తున్నట్లు అందించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయలు శ్రీనివాసరావు తో పాటు ఉపాధ్యాయ బృందం పూర్వ విద్యార్థులను అభినందించారు. పూర్వ విద్యార్థులందరూ పాఠశాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పాటును అందిస్తున్నారని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరు ఇలా పాఠశాల బలోపేతానికి తమ వంతు సహాయాన్ని అందించి విద్యార్థులకు తద్వారా ఉపాధ్యాయులకు తోడ్పాటు గా ఉండాలని అప్పుడే పాఠశాలలు బలోపేతం అయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాలరాజ్, ప్రవీణ్, దుర్గాప్రసాద్, ప్రభాకర్ తో పాటు పూర్వ విద్యార్థులు నవీన్ రెడ్డి, సతీష్, కృష్ణ, బాలయ్య పాల్గొన్నారు