calender_icon.png 31 July, 2025 | 4:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగుకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలి

30-07-2025 08:04:14 PM

తెలంగాణ రైతు సంఘం నిరసన..

మహబూబాబాద్ (విజయక్రాంతి): వానాకాలం సాగులో రైతులకు అవసరమైన యూరియాను, ఇతర ఎరువులను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం జిల్లా కేంద్రంలో సిపిఎం అనుబంధ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి కేంద్రం నుండి 9.80 లక్షల టన్నుల యూరియా కేటాయిస్తే, 6.60 లక్షల టన్నుల యూరియా మాత్రమే సరఫరా చేశారని 4.23 లక్షల టన్నుల యూరియా లోటు ఏర్పడిందని, వర్షాల వల్ల పొలం పనులు ఇతర పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు తగ్గించుకోవాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఎస్సారెస్పీ ద్వారా సాగునీటిని విడుదల చేసి రైతులకు సాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గునిగంటి రాజన్న, ఉపాధ్యక్షుడు నల్లపు సుధాకర్, మారుతినేని పాపారావు, కందాల రమేష్, కోటయ్య, బొబ్బ ఉపేందర్ రెడ్డి, నీరుటి జలంధర్, జోగ్య నాయక్, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.