calender_icon.png 22 September, 2025 | 11:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంట్లో అగ్నిప్రమాదం.. ఊపిరాడక వృద్ధుడు మృతి

22-09-2025 10:14:45 AM

నేరేడ్‌మెట్‌: హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌లోని(Neredmet) వాయుపురి కాలనీలో ఆదివారం రాత్రి ఒక ఇంట్లో అగ్నిప్రమాదం(Fire accident) జరిగింది. ఈ ప్రమాదలో ఒక వృద్ధుడు మరణించాడు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుడు, 79 ఏళ్ల జయప్రకాష్ రామన్నను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ ఊపిరాడక మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, వాయుపురి కాలనీలోని విల్లా నెం.134లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. దీంతో దట్టమైన పొగ త్వరగా ఇంటినంతా కమ్మేసింది. ఇంటి యజమాని జయప్రకాష్ రామన్న స్పృహ కోల్పోయాడు. స్థానికులు అతన్ని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ ప్రాణలు దక్కలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నేరేడ్‌మెట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.