calender_icon.png 22 September, 2025 | 10:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమల్లోకి జీఎస్టీ కొత్త శ్లాబ్‌లు.. తగ్గనున్న వస్తువుల ధరలు

22-09-2025 09:30:08 AM

హైదరాబాద్: దేశంలో ఇవాళ్టి నుంచి జీఎస్టీ(New GST Rates) స్లాబ్ రేట్లు అమలులోకి రానున్నాయి. దీంతో వస్తువుల ధరలు తగ్గనున్నాయి. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్ లను నాలుగు నుంచి రెండుకు తగ్గించింది. నేటి నుంచి జీఎస్టీలో 5, 18 శాతం స్లాబ్ లు మాత్రమే అమలు కానున్నాయి. జీఎస్టీలో ఉన్న 12,28 శాతం స్లాబులను కేంద్రం తొలగించింది. ఇంట్లో నిత్యం వాడే వస్తులపై 5 శాతం జీఎస్టీ విధించాలని నిర్ణయించింది. 12 శాతంలో ఉండే దాదాపు 99 శాతం వస్తువులపై 5 శాతం జీఎస్టీ విధించింది. 28 శాతంలో ఉండే దాదాపు 90 శాతం వస్తులపై 18 శాతం జీఎస్టీ అమలులోకి తెచ్చింది. వ్యక్తిగత బీమా, ఆరోగ్య బీమాపై జీఎస్టీని 18 శాతం నుంచి సున్నాకు తగ్గించింది.

జీవిత బీమా పాలసీలపై జీఎస్టీని 18 శాతం నుంచి సున్నాకు తగ్గించింది. 33 ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీని 12 శాతం నుంచి సున్నాకు తగ్గించింది. మ్యాప్ లు, చార్ట్ లు, గ్లోబులు, షార్ప్ నర్లు, క్రయాన్స్, పెస్టెల్స్, పెన్సిళ్లపై 12 శాతం జీఎస్టీని పూర్తిగా ఎత్తివేసింది. ఎరేజర్స్ పై ఉన్న 5 శాతం జీఎస్టీని పూర్తి ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. పలు నిత్యావసర వస్తులు తలనూనెలు, షాంపూ, సబ్బులు, టూత్ పేస్ట్, టూత్ బ్రష్, షేవింగ్ క్రీమ్ లపై పన్ను 18 నుంచి 5 శాతానికి తగ్గనుంది. పలు వ్యవసాయ పరికరాలు, పాల ఉత్పత్తులు, పలు వైద్య పరికరాలపై పన్ను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపునిచ్చింది. ట్రాక్టర్ల, విడిభాగాలు, స్పెసిఫైడ్ బయో పెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రియంట్స్, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ, స్ప్రింకర్లు, వెన్న, నెయ్యి, మజ్జిగ, ప్రీ ప్యాక్ డ్, నమ్ కీన్, భుజియా, మిక్చర్, వంగ సామాగ్రి, పాలసీసాలు, డైపర్లు, కుట్టుమిషన్లు, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్లు, గ్లూకోమీటర్, కళ్లజోళ్లుపై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.