22-09-2025 10:46:47 AM
తాండూరు,(విజయక్రాంతి): 23వ తేదీ మంగళవారం అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవం(International Ayurveda Day) సందర్భంగా ఉచిత ఆరోగ్య పరీక్షలు, మందుల పంపిణీ ఉంటుందని పతంజలి యోగ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు పటేల్ శివకుమార్, ప్రముఖ యోగా గురువు ప్రవీణ్ తెలిపారు. పతంజలి యోగ సమితి, ఆయుష్ డిపార్ట్మెంట్, ఆర్యవైశ్య సంఘము సహాయముతో తాండూరు ఆర్యవైశ్య కళ్యాణమండపంలో ఉదయము 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు వైద్యులు గణపతి రావు, సునీత , వంశీ ధర్మ గౌడ్, బి కమల, నసీం సుల్తానా, సుశీల్ కుమార్, మౌనిక , వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ జోషి పాల్గొంటారని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.