calender_icon.png 22 September, 2025 | 11:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

22-09-2025 10:06:24 AM

ముంబై: భారత ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు, సెన్సెక్స్, నిఫ్టీ(Indian Stock Markets) సోమవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభం కాగా, నిఫ్టీ 80 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1 బీ వీసాల రుసుము ప్రకటన వల్ల ఐటీ స్టాక్స్ పై ప్రతికూల ప్రభావం పడింది. జీఎస్టీ తగ్గంపు ప్రభావంతో ఆటో, ఎఫ్ఎంసీజీ సిమెంట్స్, మెటల్ రంగాలు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ప్యాక్‌లో, ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్,యు అల్ట్రాటెక్ సిమెంట్ ప్రధాన లాభాలను ఆర్జించాయి. ఈరోజు ప్రారంభ ట్రేడింగ్‌లో అదానీ పోర్ట్స్ 0.91 శాతం పైగా పెరిగి అగ్రస్థానంలో ఉన్నాయి. మరోవైపు, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టిసిఎస్, హెచ్‌సిఎల్ టెక్, భారతి ఎయిర్‌టెల్ వెనుకబడిన వాటిలో ఉన్నాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో టెక్ మహీంద్రా 5.30 శాతం పైగా నష్టపోయాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో, నిఫ్టీ ప్యాక్‌లోని 1,421 స్టాక్‌లు గ్రీన్‌లో ట్రేడవుతుండగా, 1,142 స్టాక్‌లు రెడ్‌లో ట్రేడవుతున్నాయి. నూట తొమ్మిది స్టాక్‌లు మారలేదు.