calender_icon.png 22 September, 2025 | 10:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాయ్స్ హాస్టల్‌లో ఘర్షణ.. ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

22-09-2025 08:48:52 AM

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా నారపల్లిలో ఇంజినీరింగ్ విద్యార్థి(Engineering student) ఆత్మహత్య చేసుకున్నాడు. బాయ్స్ హాస్టల్ లో సాయితేజ (19) ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సాయితేజ, సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల సీనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణ కారణంగా మనస్తాపం చెంది సాయితేజ బలవన్మరనానికి పాల్పడ్డాడు. హాస్టల్ సిబ్బంది సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని సాయితేజ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.