calender_icon.png 22 September, 2025 | 10:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజాపూర్ శివారులో రోడ్డుప్రమాదం: ఇద్దరు మృతి

22-09-2025 08:38:31 AM

హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల(Rajapur Mandal) శివారులో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి మరోకాను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. హైదరాబాద్-బెంగళూరు జాతీయరహదారిపై(Hyderabad-Bangalore National Highway) ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొన్నారు.