7 April, 2026 | 8:22 AM

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఐజీ రంగనాథ్

14-05-2024 02:06 AM

నర్సాపూర్, మే 13: నర్సాపూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలింగ్ కేంద్రాలను సోమవారం మల్టీజోన్ ఐజీ రంగనాథ్ పోలింగ్ సరళిని పరిశీలిం చారు. విధులు నిర్వహిస్తున్న పోలీ సు సిబ్బందికి పటిష్టమైన బందోబస్తు గురించి సూచనలు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, నర్సాపూర్ సీఐ జాన్‌రెడ్డి ఉన్నారు.