8 June, 2026 | 10:30 PM

నాగర్ కర్నూల్‌లో మద్యం షాప్ యజమాని అక్రమాలు - ఎక్సైజ్ దాడులు, 15 వేల జరిమానా

07-04-2026 09:55 AM

నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో మద్యం దుకాణంలో అక్రమాలు వెలుగుచూశాయి. నిబంధనలు పాటించకపోవడంతో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి రూ.15,000 జరిమానా విధించారు.

 నాగర్ కర్నూల్ (విజయక్రాంతి):  నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని ఓ మద్యం దుకాణ వ్యాపారి పెద్దమనిషిగా చలామణి అవుతూ నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాన్ని నడుపుతున్నాడు. మద్యం కోసం వచ్చిన మద్యం ప్రియుల వద్ద కూడా దురుసుగా ప్రవర్తిస్తూ దాడులకు తెగబడుతున్నాడు. ఈనెల 5న ఆదివారం ఓ మద్యం ప్రియుడు చల్లటి బీర్ ఇవ్వాలని కోరిన కారణంగా ఇంతటి ఎండలో చల్లటి బీర్ ఎక్కడ దొరుకుతుంది అంటూ దురుసుగా ప్రవర్తిస్తూ కాళీ సీసాతో దాడికి తెగబడ్డాడు.

దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పలు రకాల వత్తిల్ల కారణంగా తిరిగి కేస్ వాపస్ తీసుకున్నట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా తన ఇస్టారీతిగా మద్యం దుకాణాన్ని నడుపుతున్న విషయాన్ని గుర్తించిన కొల్లాపూర్ ఎక్సైజ్ సీఐ నాగిరెడ్డి, ఎస్ఐ హనుమంతు నాయక్ సిబ్బందితో కలిసి షాపులో తనిఖీలు నిర్వహించి విచారణ చేపట్టారు. మద్యం దుకాణంలో చాలావరకు ఆయా బ్రాండ్ల మద్యం అందుబాటులో ఉంచకుండా నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించారు. వేళలు పాటించకుండా స్టాక్ మెయింటెనెన్స్ చేయని పక్షంలో షాప్ సీజ్ చేస్తామని హెచ్చరించారు. మొదటి తప్పుగా భావించి 15వేలు పెనాల్టీ విధించారు.


ఇవి కూడా చదవండి:

మొత్తం 294 మద్యం పాపులకు 7188 దరఖాస్తులు

కార్డెన్ సెర్చ్‌లో మద్యం బాటిళ్లు, వాహనాలు స్వాధీనం

కర్నూలు బస్సు ప్రమాదం: మద్యం మత్తులో బైకర్

నేడు మద్యం దుకాణాలకు లక్కీ డ్రా

మద్యం లాటరీ ప్రక్రియకు పటిష్ట ఏర్పాట్లు

మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి శిక్ష తప్పదు.!

ఇండ్ల మధ్యలో ఉన్న మద్యం దుకాణం తొలగించాలి

మద్యం మత్తులో స్నేహితుడి దారుణ హత్య