10 June, 2026 | 3:16 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

పురుగుల మందు తాగి వృద్ధురాలి ఆత్మహత్య

16-10-2025 12:02 AM

చిట్యాల, అక్టోబర్ 15 (విజయక్రాంతి) : జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలకేంద్రంలో చోటుచేసుకుంది.ఎస్‌ఐ బోరగాల అశోక్ తెలిపిన వివరాల ప్రకారం మొగుళ్ళపల్లి మండలకేంద్రానికి చెందిన మోరే సముద్రమ్మ (70)వృద్ధురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.మోరే సముద్రమ్మ గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది.

ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం సాయంత్రం పురుగుల మందు సేవించింది.గమనించిన కుటుంబ సభ్యులు మృతురాలిని 108 అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం చిట్యాల సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ  మృతి చెందింది.మృతురాలి కుమారుడు మోరే రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.