6 August, 2026 | 2:07 AM

అసంఘటిత కార్మికులను సంఘటితం చేయాలి

06-08-2026 01:25 AM

మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పిలుపు

ముషీరాబాద్,ఆగస్టు 5 (విజయక్రాంతి): అసంఘటిత రంగ కార్మికులను సంఘటితం చేసి వారి సంక్షేమానికి కృషి చేయాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం 23వ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

కార్మికులకు పీఎఫ్, ఈఎస్‌ఐ, విద్య, వైద్యం, ఇంటి స్థలం వంటి సౌకర్యాలు కల్పించాలని, కార్మిక సంక్షేమానికి రూ.5 వేల కోట్లు కేటాయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్.రమణ, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పు సాయికుమార్, కోశాధికారి తాటికొండ మధు, నాయకులు ఎం.యాదగిరి, సి.హెచ్.వెంకటయ్య, పిల్లి హరిచంద్ర, బి.నరిసింహ, సంపత్, శ్రీనివాస్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.