calender_icon.png 16 October, 2025 | 6:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

16-10-2025 12:00:00 AM

మహబూబాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి) : స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని, కేంద్ర బీజేపీ సర్కార్ షెడ్యూల్ 9లో చేర్చాలని బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. చట్టబద్ధ రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చొప్పరి శేఖర్ పెరుగు కుమార్ డిమాండ్ చేశారు. 

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి పంపించినా కేంద్ర బీజేపీ సర్కార్ ఇంతవరకు పెండింగ్లో ఉంచి పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఢిల్లీ వెళ్లి ఒత్తిడి పెంచాలన్నారు. కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో ఉద్యమించాలన్నారు. ముఖ్యంగా రాష్ట్ర బిజెపి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న ఇంతవరకు బీసీ రిజర్వేషన్లపై పట్టించుకోవడంలేదని వెంటనే బీసీలకు చట్టబద్ధ 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఆందోళనకు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి అజయ్ సారధి రెడ్డి సంఘీభావం తెలిపారు. రేశపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, వరిపల్లి వెంకన్న, వెలుగు శ్రావణ్, ఎండి ఫాతిమా, కేదాసు రమేష్, మంద శ్రీను, గాదం శ్యాం, ప్రసాద్ యాదవ్, ఎర్రోజు పద్మ, మంద శంకర్, తండా శ్రీనాథ్ పాల్గొన్నారు