24 March, 2026 | 9:04 AM

చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి

18-09-2024 12:31 AM

చేగుంట, సెప్టెంబర్ 17: కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు చెరువు లోపడి మునిగిపోతుండగా స్థానికులు రక్షించగా.. చికిత్స పొందుతూ మంగళవారం ఆమె మృతి చెందింది. మండల పరిధిలోని పెద్దశివునూరు గ్రామానికి చెందిన తలారి పోచమ్మ (83) ఈనెల 15న గ్రామంలోని మొగుళ్ల చెరువులో కాలకృత్యా లు తీర్చుకోవడానికి వెళ్లింది. ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగిపోతుండగా స్థానికులు చూసి రక్షించారు.

ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా మంగళవారం మృతి చెందినట్లు చేగుంట ఎస్‌ఐ చైతన్యరెడ్డి తెలిపారు. మృతురాలి మనువడు తలారి మహేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యా ప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.