03-02-2026 09:32:35 PM
ఏటూరునాగారం,(విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో పలు గ్రామాల ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంత్రి సీతక్క ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనలతో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న లబ్ధిదారులకు పంపిణీ చేశారు. హళావత్ కళ్యాణి-15వేలు, అనుము నీలయ్య-20వేలు, కొండమల్ల రాణి 21 వేలు, సంగిరెడ్డి లక్ష్మి 25 వేలు, బోట పోసాని -32 వేలు, తుమ్మ నవనీత రావు- 37వేలు, గార జయమ్మ- 43 వేలు, జక్కుల లత 45వేలు, లొటపెట్టల మహాలక్ష్మి-1లక్ష10 వేలు, బండారి రాజు- 1.14వేల రూపాయలు విలువ గల చెక్కులను లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణి చేశారు.