ఓటింగ్ శాతం పెంపునకు కృషి చేయాలి
కామారెడ్డి, మే 5 (విజయక్రాంతి): ఓటింగ్ శాతం పెంపునకు అధికారులు కృషి చేయాలని జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకుడు గోపాల్ జీ తివారి సూచించారు. ఆదివారం కామారెడ్డి జిల్లాలోని ఆదర్శ నగర్, దేవునిపల్లి, లింగంపేట్, ఎల్లారెడ్డి మండల కేంద్రాల్లో ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ జితేష్ వీ పాటిల్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో సజావుగా జరిగే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలో 6,80,921 మంది ఓటర్లు ఉన్నారని, వారి కోసం 913 పోలింగ్ కేంద్రాల ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో కొత్తగా 53, 678 మంది ఓటు హక్కు పొందారని వెల్లడించారు. అనంతరం ఎల్లారెడ్డి జీవదాన్ పాఠశాలలోని స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబం ధించిన ఈవీఎంలు ఈ స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచినట్లు ఆర్‌డీవో ప్రభాకర్ తెలిపా రు. కార్యక్రమంలో నోడల్ అధికారి రఘునాథ్, స్థానిక అధికారులు పాల్గొన్నారు.




