26 May, 2026 | 1:02 PM

Breaking News

సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యేదే   •   పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన   •   డంప్ యార్డ్ ఏర్పాటుకు ఒప్పుకోం..!   •   తాళం వేసిన ఇంట్లో చోరీ   •   మళ్లీ సీఎం కుర్చీ పంచాయతీ.. ఢిల్లీకి సిద్ధూ, డీకే.. పర్యటనపై ఉత్కంఠ   •   రోడ్డుప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి.. ఎస్పీ నితికా పంత్ నివాళి   •   ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు   •   పాలమూరు ప్రాజెక్టు పూర్తికి.. అవాంతరాలు అధిగమిస్తాం: మంత్రి జూపల్లి   •   డ్రైవర్ నిద్రమత్తు.. పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు బోల్తా   •   మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు   •  

గుడమామడలో టీబీ ముక్త భారత్ శిబిరం

02-04-2026 04:10 PM

జైనూర్ ఏప్రిల్ 2 (విజయ క్రాంతి) : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం గుడమామడ గ్రామంలో ‘టిబి ముక్త భారత్’ అభియాన్‌లో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరం స్థానిక పీహెచ్సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. గ్రామస్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, టిబి లక్షణాలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వైద్య సిబ్బంది గ్రామ ప్రజలకు దగ్గు ఎక్కువ రోజులు కొనసాగితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. టిబి వ్యాధి పూర్తిగా నయం అయ్యే వ్యాధి అని, మందులను మధ్యలో ఆపకుండా క్రమంగా తీసుకోవాలని వివరించారు.శిబిరంలో పాల్గొన్న ఆరోగ్య సిబ్బంది పరిశుభ్రత, పోషకాహారం ప్రాముఖ్యతపై వివరించారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవాలని గ్రామ సర్పంచ్ కొముర యశోద ప్రజలను కోరారు.