6 July, 2026 | 2:04 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, నూతన గ్రామ కమిటీ ఎన్నిక

19-06-2025 06:32 PM

చిలుకూరు: చిలుకూరు మండల(Chilkur Mandal) కేంద్రంలోని జేజేనగర్ కాలనీలో గురువారం ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, నూతన గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది, ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ శాఖ అధ్యక్షులుగా కాంపాటి రంజిత్ కుమార్, ఎంఎస్పి, గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ బాలుని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశం చిలుకూరు మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మల్లెపంగు సూరిబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, రాష్ట్ర నాయకులు, చిలుకూరు మండల ఇన్చార్జ్ కొండపల్లి ఆంజనేయులు మాదిగ, ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి కోటేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి, చిలుకూరు మండల కో ఇన్చార్జి ఏపూరి సత్యరాజు మాదిగలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... జులై 7న జరిగే ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రామ గ్రామాన ఘనంగా జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జిల్లా నాయకులు సిద్దెల శ్రీను మాదిగ, ఎం జె ఎఫ్ మండల ఉపాధ్యక్షులు మల్లెపంగు ఉపేందర్,  నూక పంగు వెంకటి, కందుకూరి వెంకటేశ్వర్లు, బొయిల  పాపయ్య, కందుకూరి వీరయ్య, కాంపాటి గురవయ్య, మాతంగి వీరస్వామి, కందుకూరి నాగేష్, గజ్జి ప్రశాంత్, కందుకూరి శ్రీను, మల్లెపంగు అశోక్, ముదిగొండ సైదులు, కందుకూరి వీరబాబు, మల్లెపంగు వీరయ్య, నేలమర్రి యాదగిరి, నూక పంగు మణికంఠ, వడ్డేపల్లి వీరబాబు, జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.