6 July, 2026 | 3:12 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

కణితి సతీష్ కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన పొదేం వీరయ్య

19-06-2025 06:35 PM

భద్రాచలం (విజయక్రాంతి): ఇటీవల భద్రాచలంలో దారుణంగా హత్య కాబడిన గిరిజన బిడ్డ కణితి సతీష్ దశదిన కర్మలో గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, తెలంగాణ అటవీశాఖ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదేం వీరయ్య(Telangana Forest Development Corporation Chairman Podem Veeraiahపాల్గొన్నారుఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యుల పట్ల ప్రగాఢ సానుభూతి తెలుపుతూ సతీష్ నివాళులు అర్పించారు. కుటుంబానికి తాను అండగా ఉంటానని హత్యకు పాల్పడిన వారు అందులో పాల్గొనవారు ఎంతటి వారైనా సరే వారికి శిక్ష పడే వరకు వారిని విడిచిపెట్టనని, ఈ కేసు విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా ఆధారాలు సేకరించి దోషులందరకు శిక్షపడేలా చేసేవరకు తాను వారి వెంట నిలబడతానని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం మండల అధ్యక్షుడు వినీల్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు ఎడారి ప్రదీప్ సాంబ వరుణ్ శ్యామ్ సింహాద్రి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.