calender_icon.png 15 October, 2025 | 11:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు జీఎస్టీ అండ్ కస్టమ్స్ శాఖ ఆధ్వర్యంలో ట్రంక్ బాక్స్‌ల పంపిణీ

15-10-2025 08:26:12 PM

కుభీర్ (విజయక్రాంతి): కుభీర్ మండలంలోని డోడర్న గ్రామంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో బుధవారం జీఎస్టీ అండ్ కస్టమ్స్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ట్రంక్ బాక్స్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాదవ్ పంతులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక అధికారులు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ, “ఈ ట్రంక్ బాక్స్‌లు విద్యార్థులకు వ్యక్తిగత విద్యా సామగ్రిని సురక్షితంగా ఉంచుకోవడానికి, శిక్షణ అవసరాల కోసం ఉపయోగపడతాయని” అన్నారు. పాఠశాల అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ తరహా మద్దతు విద్యార్థుల విద్యా ప్రగతికి తోడ్పడుతుందని, మరియు సమర్థవంతమైన విద్యా వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో ఉపయోగపడతుందని పేర్కొన్నారు.