20 May, 2026 | 1:46 PM

అంకుసాపూర్‌లో రెడ్డి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

20-05-2026 12:43 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని అంకుసాపూర్ గ్రామంలో రెడ్డి సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పలువురు సభ్యులు, పెద్దలు పాల్గొన్న సమావేశంలో ఏకగ్రీవంగా కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం అధ్యక్షుడు కడుదూరి రవీందర్ రెడ్డి, (రాజిరెడ్డి కుమారుడు), ఉపాధ్యక్షుడిగా అంచ ఎల్లారెడ్డి (రాఘవ రెడ్డి కుమారుడు), క్యాషియర్‌గా ఉమ్మారెడ్డి కరుణాకర్ రెడ్డిని ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు గ్రామస్తులు, సంఘ సభ్యులు అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధి, సంఘ ఐక్యత కోసం కలిసి పనిచేస్తామని నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు.