calender_icon.png 17 July, 2025 | 10:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండల బంజారా నూతన కార్యవర్గం ఎన్నిక

16-07-2025 11:37:59 PM

సదాశివనగర్,(విజయక్రాంతి): ఆల్ ఇండియా బంజారా మండల నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల  అధ్యక్షునిగా శంకర్ నాయక్,ప్రధాన కార్యదర్శిగా విజయ్ కుమార్, ఉపాధ్యక్షునిగా అంబర్ సింగ్, బిందాస్, కోశాధికారిగా ప్రకాష్ నాయక్ సహాయక కార్యదర్శులు లాల్ సింగ్ నాయక్ లను జిల్లా అధ్యక్షులు రాథోడ్ సురేందర్ నాయక్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలక్షన్ అధికారి మోతి సింగ్ నాయక్, పెంట్యా నాయక్ నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సురేందర్ నాయక్ మాట్లాడుతూ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం దేశంలో అతిపెద్ద సంఘంగా గుర్తింపు పొందిందని తెలిపారు.

బంజారా జాతి ప్రజలకు ఎక్కడైనా అన్యాయం జరుగుతే అక్కడ ముందుండి పోరాటం చేస్తుందని చెప్పారు. బంజారా జాతి ప్రజలను ఏకం చేస్తూ తమ యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించి చైతన్యం చేస్తుందని తెలిపారు. త్వరలో జిల్లాలో అతిపెద్ద సభ ఏర్పాటు చేసి మన యొక్క ప్రత్యేకత గురించి తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రావణ్, సదర్, బొట్టు మూతిరాం నాయక్ లస్కర్ నాయక్ విజయ్ ఓంకార్ వివిధ తాండ నాయక్ కారోబార్ బంజారా ప్రజలు పాల్గొన్నారు.