16-07-2025 11:34:55 PM
భూ భారతి దరఖాస్తులపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి,(విజయక్రాంతి): రెవెన్యూ సదస్సుల్లో జిల్లాలోని ప్రజల నుంచి వచ్చిన భూ సమస్య దరఖాస్తులను నిబంధనల ప్రకారం జూలై నెలాఖరు వరకు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ లో భూ భారతి దరఖాస్తులపై జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ డి.వేణుతో కలిసి సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ... భూ హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూ భారతి చట్టం అమలులో భాగంగా జిల్లాలో విజయవంతంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, ప్రజల నుంచి భూ సమస్యల పై వచ్చిన దరఖాస్తులను భూ భారతి చట్టం నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి జూలై చివరి నాటికి పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు.