calender_icon.png 17 July, 2025 | 3:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల స్వయం సమృద్ధే లక్ష్యం!

17-07-2025 12:00:00 AM

  1. తెలంగాణ సర్కారు అడుగులు

8,552 ఎస్ హెచ్ జీలకు రూ.12 కోట్లు

ఇందిరా మహిళా శక్తి కింద ఇచ్చిన రుణాలకు వడ్డీ తిరిగిచెల్లింపు

రాజన్న సిరిసిల్ల:జూలై 15(విజయక్రాంతి) మహిళామణులు ఆర్థికంగా బలపడేందు కు... స్వయం సమృద్ది సాధించేందుకు జిల్లాలోని స్వయం సహాయక మహిళా సంఘా లు. ఎస్ హెచ్ జీ లు ఇందిరా మహిళా శక్తి కింద తీసుకున్న రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ తిరిగి చెల్లించేందుకు అన్ని ఏర్పాట్లు చే స్తున్నది.

2024- 2025 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో రు ణాలు తీసుకొని, సకాలంలో చెల్లించిన జిల్లాలోని 8552 ఎస్ హెచ్ జీ లకు దాదాపు రూ.12 కోట్ల వడ్డీ డబ్బులు పంపిణీ చేయనున్నది.. 

ఈ నెల 17వ తేదీ నుంచి ...

జిల్లాలోని స్వయం సహాయక మహిళా సంఘాలు ఎస్ హెచ్ జీ 8552 లకు ఈ నెల 17వ తేదీన వేములవాడ  నియోజకవర్గం లో...ఈ నెల 18వ తేదీన సిరిసిల్ల నియోజకవర్గంలో పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

నాలుగు నియోజకవర్గాల పరిధిలో.వేములవాడ నియోజ కవర్గం పరిధిలోని వేములవాడ అర్బన్ మం డలంలోని 365 ఎస్ హెచ్ జీ లకు రూ. 46. 84 లక్షలు, వేములవాడ రూరల్ మండలంలోని 442 ఎస్ హెచ్ జీ లకు రూ.58.81 లక్షలు, చందుర్తి మండలంలోని 613 ఎస్ హెచ్ జీ లకు రూ.82.50 లక్షలు, రుద్రంగి మండలంలోని 325 ఎస్ హెచ్ జీలకు రూ. 41.61 లక్షలు,

కోనరావుపేట మండ లంలో ని 910 ఎస్ హెచ్ జీ లకు రూ. 113. 32 లక్ష లు, మొత్తం 2655 ఎస్ హెచ్ జీ లకు రూ. 3 కోట్ల 43 లక్షల వడ్డీ రానున్నది. సిరిసిల్ల ని యోజకవర్గంలోని తంగళ్ళపల్లి మండలంలోని 926 ఎస్ హెచ్ జీ లకు రూ. 124.40 లక్షలు, గంభీరావుపేట మండలంలోని 1004 ఎస్ హెచ్ జీ లకు రూ.141.34 లక్షలు, ముస్తాబాద్ మండలంలోని 1018 ఎ స్ హెచ్ జీ లకు రూ. 138.68 లక్షలు, వీర్నపల్లి మండలంలోని 280 ఎస్ హెచ్ జీ లకు రూ.34.76 లక్షలు, ఎల్లారెడ్డిపేట మండలంలోని 1022 ఎస్ హెచ్ జీ లకు రూ. 150.85 లక్షలు..

మొత్తం 4250 ఎస్ హెచ్ జీ లకు రూ. 5కోట్ల 90 లక్షల వడ్డీ రానున్నది. చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండలంలోని 696 ఎస్ హెచ్ జీ లకు రూ. 98.90 లక్షలు, మానకొండూరు నియోజకవర్గంలోని 951 ఎస్ హెచ్ జీ లకు రూ.145. 51 లక్షల వడ్డీ రానున్నది.

మహిళా సంఘాల స భ్యుల్లో హర్షం.జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 8552 ఎస్ హెచ్ జీ లకు రూ. 11 కోట్ల 77 లక్షల 52 వేల వడ్డీ తిరిగి చెల్లించేందుకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తాము తీసుకున్న రు ణాలకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ తిరిగి చెల్లించనుండడంతో మహిళా సంఘాల సభ్యుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.