ఆశ్రి సొసైటీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల కిట్ల పంపిణి
ముఖ్య అతిథులుగా హాజరైన జిన్నారం మాజీ జడ్పీటీసీ కొలన్ బాల్ రెడ్డి
20 కుటుంబాలకు నిత్యావసర కిట్ల పంపిణి
జిన్నారం/గుమ్మడిదల: ఆశ్రి సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చెసిన నిత్యావసర వస్తువుల కిట్లను జిన్నారం మాజీ జడ్పీటీసీ కొలన్ బాల్ రెడ్డి పంపిణి చేసారు. వినాయక నవరాత్రుల పురస్కరించుకొని ఆశ్రి సొసైటీ ఆధ్వర్యంలో బొల్లారం మున్సిపల్ పరిధిలో నివాసం ఉంటున్న 20 కుటుంబాలకు సుమారు 52,000 రూపాయల విలువైన నిత్యావసర వస్తువుల కిట్లను జిన్నారం మాజీ జడ్పీటీసీ కొలన్ బాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణి చేశారు.
ఈ సందర్బంగా కొలన్ బాల్ రెడ్డి మాట్లాడుతూ.... ఆశ్రి సొసైటీ ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రులలో వరుసగా 9 రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఒక సంప్రదాయంగా కొనసాగుతోందన్నారు.ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అదే భక్తి భావంతో 9 రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.






