మడేలయ్య రజక సంఘం కమిటీ ఎన్నిక
08-06-2026 01:14 AM
వెంకటాపూర్, జూన్ 7 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని మడేలయ్య రజక సం ఘం నూతన కమిటీని ఆదివారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ సభ్యులు, పెద్దల సమక్షంలో నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో అందరి నిర్ణయం మేరకు గౌరవ అధ్యక్షుడిగా రాచర్ల సాయిలు, ఉపాధ్యక్షుడిగా సాంబరాజు దేవేందర్ ఎన్నికయ్యారు.
అలాగే ప్రధాన కార్యదర్శిగా ముప్పు పూర్ణేందర్, కోశాధికారిగా గూడెల్లి ప్రభాకర్, ప్రచార కార్యదర్శిగా సాంబరాజు కిరణ్ ఎన్నికైనట్లు సంఘ పెద్దలు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను సంఘ సభ్యులు అభినందించి, సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.






