8 June, 2026 | 2:24 AM

బీర్కూర్‌లో సైబర్ మోసం..

08-06-2026 01:15 AM

ఆర్టీవో యాప్ లింక్ పేరుతో రూ.95,100 కాజేసిన కేటుగాడు

బాన్సువాడ, జూన్ 7 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన షేక్ మజార్ సైబర్ మోసగాళ్ల బారిన పడి రూ.95,100 నగదును కోల్పోయాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, తన ఫోన్కు వచ్చిన ఆర్టీవో యాప్ లింక్ను నమ్మి క్లిక్ చేయడంతో సైబర్ నేరగాళ్లు అతని బ్యాంకు ఖాతాకు ప్రాప్యత పొందారు. అనంతరం ఆరు విడతల్లో మొత్తం రూ.95,100ను ఖాతా నుంచి అక్రమంగా బదిలీ చేసి కాజేశారు. డబ్బులు ఖాతా నుంచి మాయమైనట్లు గుర్తించిన బాధితుడు వెంటనే బీర్కూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.