22 July, 2026 | 2:52 AM

ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అధ్యాపకుల సంఘం ఎన్నికలు

22-07-2026 01:12 AM

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని యూనిట్లు ఏకగ్రీవం

నల్లగొండ టౌన్, జులై 21 : ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అధ్యాపకుల సంఘం రాష్ట్రస్థాయి ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో యూనిట్ స్థాయి ఎన్నికలు నిర్వహించారు.ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (అటానమస్), నల్లగొండ ప్రెసిడెంట్ - ప్రొఫెసర్ టి. అరవింద్,సెక్రటరీ గా ఈ. రాంరెడ్డి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఎం.కె.ఆర్ డిగ్రీ కళాశాల, దేవరకొండ: ప్రెసిడెంట్ గా డాక్టర్ ఎస్. రాజారాంప్రభుత్వ డిగ్రీ కళాశాల, హాలియా: ప్రెసిడెంట్ గా డాక్టర్ ఎం.డి. హుస్సేన్, సెక్రటరీ గా డాక్టర్ జి. యాదగిరి,కె.ఎన్.ఎం డిగ్రీ కళాశాల,మిర్యాలగూడ: ప్రెసిడెంట్ గా భీమార్జున్ రెడ్డి, సెక్రటరీ గా డాక్టర్ బి. రవీందర్,ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నకిరేకల్: ప్రెసిడెంట్ గా కె. ప్రవీణ్ రెడ్డి, సెక్రటరీ గా కె. హరితనాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నల్లగొండ: ప్రెసిడెంట్ గా కె. శివరాణి, సెక్రటరీ గా ఎం. వెంకట్రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రామన్నపేట: ప్రెసిడెంట్ గా డాక్టర్ ఎన్.ఎల్. నీలిమ, సెక్రటరీ గా డాక్టర్ రవీందర్ రావు లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎస్. రాజారాం ఎన్నికైన అందరికీ అభినందనలు తెలిపారు.