22 March, 2026 | 10:54 PM

పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల నిర్వహణ ఉండాలి

08-10-2025 12:21 AM

-జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్, అక్టోబర్ 7(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలను ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తెలి పారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కొరకు ప్రిసైడింగ్ అధికారుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగావాల్మీకి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

అనంతరం ఉద్దండపూర్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు సంబంధించి పునరావాసం తదితర అంశాలకు పరిగణలోకి తీసుకొని సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా నిర్వహించుటలో అధికారుల విధులు చాలా కీలకమని, చిన్న పొరపాటుకు అవకాశం ఇవ్వొద్దని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

ఎన్నికలు నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలు, మార్గదర్శకాల పై సమగ్రమైన అవగాహన కలిగివుండాలని సూచించారు. ఎన్నికల విధులు చాలా కీల కమని, చిన్న పొరపాటుకు తవులేకుండా పకడ్బందీగా నిర్వహించుటకై అధికారులు కార్యోన్ముఖులు కావాలని స్పష్టం చేశారు. ఎన్నికల విధులు నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఎన్నికల సంఘం నిబంధనలు మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని ఆమె స్పష్టం చేశారు.

ఎన్నికల విధులు నిర్వహణపై హ్యాండ్ బుక్ లోని ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఏదేని సందేహాలు ఉంటే శిక్షణా కార్యక్రమంలో నివృత్తి చేసుకోవాలని సూచించారు.మాస్టర్ ట్రైనర్స్ ఎన్నికల నిర్వహణ,ప్రిసైడింగ్ అధికారుల విధుల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ నిచ్చారు.ఈ కార్యక్రమంలో డి.పి.ఓ పార్థసారథి, మాస్టర్ ట్రైనర్ బాలు యాదవ్, ఇతర ఎన్నికల శిక్షణ అధికారులు పాల్గొన్నారు.