calender_icon.png 9 December, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల్లో ప్రజా పాలన తోనే అభివృద్ధి సాధ్యం

08-12-2025 08:15:54 AM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు.

ఎమ్మెల్యే సామేలు, సర్వోత్తమ్ రెడ్డి సమక్షంలో చేరిక

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆకారపు భాస్కర్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, ఎఐసిసి  నాయకులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి సమక్షంలో ఆదివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలల్లో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సహకారంతో నేడు గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. సంక్షేమ పథకాలు పేద ప్రజల సద్వినియోగం చేసుకొని అభివృద్ధి లోకి రావాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంకినేని గోవర్ధన్ రావు, మేనేని మాధవరావు, సర్పంచ్ అభ్యర్థి బొంకూరి సుదర్శన్, పెండెం రామ్మూర్తి, కొండరాజు, అజయ్ కుమార్, తల్లాడ కేదారి, తదితరులు పాల్గొన్నారు.